Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 2:04 pm Posted by : ramakrishna

24న కేంద్ర సాయుధ  మాజీ బలగాల సంఘం వార్షికోత్సవం

నిజామాబాద్, బతుకమ్మ: కేంద్ర మాజీ సాయుధ పోలీసుల బలగాల (తెలంగాణ) సిబ్బంది సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవాన్ని ఈనెల 24న బాగ్ లింగంపల్లి సుందరయ్య  విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజు తెలిపారు. మాజీ కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమ సంఘం( సీఆర్ పీఎఫ్, బీ ఎస్ ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్) ప్రథమ వార్షికోత్సవం విజయవంతం చేయడానికి సీఏపీఎఫ్(సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్) జవాలన్లు తరలిరావాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరు కావాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో నివసిస్తున్న మాజీ పారా మిలటరీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర సాయుధ విశ్రాంతి పోలీసు బలగాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకై ఉండాలని అసోసియేషన్ ను ఏర్పాటు చేశామన్నారు.


24th anniversary of Central Armed Forces Ex-Servicemen Association