- తాసిల్దార్ జె.మల్లయ్య
బతుకమ్మ,ఏర్గట్ల: రాబోయే 4 రోజులలో అత్యంత భారీ వర్షాలు ఉన్నందున ప్రజల సౌకర్యార్ధం ఏర్గట్ల తాహసీల్దార్ కార్యాలయము లో భారీ వర్షాల గురించి 24 గంటలు ప్రజల సౌకర్యం కొరకు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం జరిగిందని మండల తాసిల్దార్ జె మల్లయ్య తెలిపారు.ఇట్టి కంట్రోల్ రూములో రాత్రి పగలు 24 గంటలు మండల తాసిల్దార్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.మండలములోని ప్రజలు వర్షాల సమయములో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా,ఏదైనా సమాచారము ఇవ్వదలచినా ఈ క్రింద చూపిన ఫోన్ నెంబర్ లకు ఫోన్ చేసినట్లు అయితే అత్యవసరముగా పై అధికారులకు మరియు ప్రభుత్వ వ్యవస్థలకు సమాచారము ఇచ్చి ప్రజలకు కావలసిన రక్షణ చర్యలు ప్రభుత్వము వెంటనే చేపట్టి ప్రజలకు ప్రాణ,నష్టము ఆస్తుల నష్టము,చెరువులు,కుంటలకు నష్టము,పంట పొలాలకు నష్టము,రైతులకు కరెంటు వాళ్ళ ప్రమాదములు జరిగినట్లు అయితే వెంటనే స్పందించి చర్యలు చేపట్టుటకు అవకాశము ఉన్నది. కావున మండలములోని ప్రజలు అందరు అత్యవసరముగా వర్షాల వలన ఏదైనా సమస్యలు ఉన్నచో 24 గంటలు కంట్రోల్ రూము సౌకర్యము ను వినియోగించుకొని వర్షాల వళ్ళ జరుగు ఆపదల నుండి తమను కాపాడు కోగాలరని మండల ప్రజలకు మండల తాసిల్దార్ మల్లయ్య,మండల ఎంపీడీవో వెంకటేశ్వర్లు,ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్, లకు ఫోన్ చేసి తెలియజేయగలరు.
-అత్యవసర కంట్రోల్ రూము -ఫోన్ నెంబర్-లు 8331853219– 8919709260– 8712659869