ఘనంగా ఇందూరు హై స్కూల్ 23 వ వార్షికోత్సవం

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందూరు హైస్కూల్లో శనివారం పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా 23వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగయ్య, విశిష్ట అతిథులుగా వివిధ పాఠశాలల కళాశాలల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాఠశాలకు విచ్చేసిన అతిధులచే జ్యోతి ప్రజ్వలన నిర్వహించి అనంతరం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగయ్య, పాఠశాల కరస్పాండెంట్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో...