బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందూరు హైస్కూల్లో శనివారం పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా 23వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగయ్య, విశిష్ట అతిథులుగా వివిధ పాఠశాలల కళాశాలల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాఠశాలకు విచ్చేసిన అతిధులచే జ్యోతి ప్రజ్వలన నిర్వహించి అనంతరం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగయ్య, పాఠశాల కరస్పాండెంట్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బోధన్ లో విద్యాసంస్థలన్నీ కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా విద్యా బోధనను అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత విద్యను అందిస్తు, విద్యార్థులను అత్యున్నత స్థానంలో నిలుపుతున్నామని, అత్యున్నత విద్యకు బోధన్ నిలయమని కావున విద్యార్థులు వారి

తల్లిదండ్రులు కార్పొరేట్ సంస్థలకై పరుగిడి విద్యార్థుల పై భారం పడేలా చూడవద్దని అన్నారు. రానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులతో పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తేవాలని, అత్యున్నత స్థాయిలో నిలవాలని కోరారు. ఇందూరు పాఠశాలలో విద్యతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని అందులో భాగంగా ఈనాడు సంస్థ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు సంస్థ మరియు పాఠశాల యాజమాన్యం వారికి ఘనంగా సత్కరించి బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. అలాగే పాఠశాల యాజమాన్యం తరఫున విచ్చేసిన అతిధులకు ఘనంగా సన్మానించి బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. పట్టణ ట్రస్మ అధ్యక్షులు హరికృష్ణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమంలో లయన్స్ బసవేశ్వర రావు, శ్రీనివాసరావు, డాక్టర్ భూమి రెడ్డి, నరసింహారెడ్డి, సాంబిరెడ్డి, కొడాలి వినయ్, కొడాలి లావణ్య, లక్ష్మీ, సుధారాణి, స్వాతి, రామారావు, సురేష్ రమణారెడ్డి, రాజు, శ్యాంసుందర్, రాజేశ్వర్, సురేష్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
