Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 9:15 pm Posted by : ramakrishna

40 రోజుల్లో గుండెపోటుతో 23 మంది యువకులు మృతి

  • కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘటన

 

కర్ణాటక, బతుకమ్మ : కర్ణాటకలోని హసన్ జిల్లాలో 40 రోజుల్లో గుండెపోటుతో 23 మంది యువకులు మృతి చెందారు. అందరూ 19 నుండి 25 ఏండ్ల లోపు యువకులు కావడంతో.. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి ఏమైనా సంబంధం ఉందా అని అధికారులని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. దీంతో మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య   ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.