21న లెనిన్ శతవర్థంతి ముగింపు సభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 21న హైదరాబాదులో జరిగే లెనిన్ శతవర్ధంతి ముగింపు సభ పోస్టర్లను పార్టీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రామిక భవన్, కోటగల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ జనవరి 21, 2024 నాటికి మార్క్సిస్టు మహోపాధ్యాయులలో ఒకరైన కా॥ లెనిన్ అమరుడై వంద సంవత్సరాలు నిండుతున్నదన్నారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంపాటు 2024 జనవరి...