Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 4:18 pm Posted by : ramakrishna

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ ల బదిలి

  • నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య
  • కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీసు అధికారులను బదిలీ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నిజాంబాద్ పోలీస్ కమిషనర్ గా 2016 ఐపీఎస్ బ్యాచ్ పోతరాజు సాయి చైతన్య ను నియమించింది. సాయి చైతన్య ప్రస్తుతం యాoటి నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పని చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కల్మేశ్వర్ బదిలీ తర్వాత ఐదు నెలలుగా కమీషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మను ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. కామారెడ్డి ఎస్పీగా 2015 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన రాజేష్ చంద్ర నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాదాద్రీ భువనగిరి జిల్లా డీసీపీ గా పని చేస్తున్న రాజేష్ చంద్ర కు కామారెడ్డి ఎస్పీ గా నియమించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ నియమిస్తారా? లేక నాన్ క్యాడర్ ఐపీఎస్ నియమిస్తారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. డైరెక్ట్ ఐపీఎస్ ను నియమించడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో శాంతిభద్రతలు గాడిన పడే అవకాశాలు ఉన్నాయి.

21 IPS officers transferred in the state