వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 24 గంటల్లో 20 ఆపరేషన్లు
వైద్యులు, సిబ్బందిని అభినందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, బతుకమ్మ : వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు 24 గంటల వ్యవధిలో వరుసగా 20 శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైద్య బృందాన్ని, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక పరికరాలు, సిబ్బంది, వసతులతో బలోపేతం అవుతున్నాయని...