Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 8:14 pm Posted by : ramakrishna

రాష్ట్రస్థాయికి 2 ఇన్స్పైర్ ప్రాజెక్టుల ఎంపిక

ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో భాగమైన ఇన్స్పైర్ ప్రాజెక్టులలో ఇందల్వాయి పాఠశాల నుండి మూడు ఇన్స్పైర్ ప్రాజెక్ట్లను ఎగ్జిబిట్ చేయగా అందులో నుండి రాష్ట్ర స్థాయి వరకు రెండు ప్రాజెక్టులు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పదవ తరగతి చదువుతున్నటువంటి అరిపెల్లి సిద్దు,కేతావత్ సుమన్ లు ఇద్దరు సెలెక్ట్ కావడం జరిగిందన్నారు. మొత్తం 250 ఎగ్జిబిట్లలో ఇందల్వాయి పాఠశాల నుండి రెండు ఎంపిక కావడం గర్వకారణమన్నారు.రానున్న భవిష్యత్తులో విద్యార్థులు మరింత ముందుకు వెళ్లాలని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. ఇందల్వాయి పాఠశాలను రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైన్స్ ఫెయిర్ క్రీడలు,ఆటలు,పాటలు వంటి రంగాలలో విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు అభినందించారు.