బతుకమ్మ, పిట్లం : పిట్లం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు తహశీల్దార్ వేణు గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. గోద్మేగాం సమీపంలో గల క్రషర్ మిషన్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, ఆయా శాఖల మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.