Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 12:36 pm Posted by : ramakrishna

17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గంగారాం మృతి

. రాజన్న సిరిసిల్ల లో ఘటన
. స్వగ్రామం నిజామాబాద్ జిల్లా సుద్దులంలో విషాదచాయలు

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ తోట గంగారాం(58) లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామానికి చెందిన గంగారాం గతంలో తెలంగాణ సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పని చేస్తున్న ఆయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్ మెంట్ కు సోమవారం వెళ్లిన ఆయన.. అర్ధరాత్రి సమయంలో తిరిగి వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చాడు. లిఫ్ట్ సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి కాలు పెట్టిన ఆయన కిందపడ్డారు.

తీవ్రగాయాలపాలైన గంగారాంను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారాం మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.