Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2024, 3:08 pm Posted by : ramakrishna

17శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలి : టీఎస్ యూటీఎఫ్ 

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ నగర కార్పొరేషన్ సరిహద్దు నుండి 8కీ.మీ. పరిధిలో ఉన్న గ్రామాలకు, తాండలకు 17శాతం హెచ్ ఆర్ ఏ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు కోరారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. హెచ్ ఆర్ ఏ అమలు చేసే క్రమంలో గతంలో ఇచ్చిన ఉత్త్వుల జాబితాలో కొన్ని చేర్చలేదని అన్నారు. మాక్లూర్ మండలం లోని ఆమ్రాద్ తాండా, మదన్ పల్లి తాండా, సాట్లాపూర్ తాండా, గద్వాల్ క్యాంప్, వేణు కిసాన్ నగర్, ఒడ్డేర కాలనీ (మామిడి పల్లి), జక్రన్ పల్లి మండలాల్లోని పుప్పాల పల్లి, డిచ్ పల్లి మండలం లోని వెస్లీ నగర్ లకు 17 శాతం ఇంటి అద్దె అలవెన్స్ చెల్లించాలని కోరారు. ఈ కార్య్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సత్యానంద్, ఓ.రమేష్, జిల్లా ట్రెజరర్ ఎం.మల్లేష్, జిల్లా కార్యదర్శులు ఎం.జనార్ధన్, వి.సాయన్న పాల్గొన్నారు.