16నుండి సమగ్ర ఇంటింటి కుంటుంబ రీసర్వే

కామారెడ్డి, బతుకమ్మ : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుండి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వే లో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక  అవకాశం కల్పించిందని తెలిపారు. సర్వే కు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో...