Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2025, 6:35 pm Posted by : ramakrishna

16నుండి సమగ్ర ఇంటింటి కుంటుంబ రీసర్వే

కామారెడ్డి, బతుకమ్మ : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుండి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వే లో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక  అవకాశం కల్పించిందని తెలిపారు. సర్వే కు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో నిర్ణీత పొఫార్మాలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చును. లేదా ప్రభుత్వం ఇట్టి విషయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 నకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు తెలియజేయవచ్ఛని, లేదా ప్రభుత్వ వెబ్ సైట్ నుండి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రంలో అందించవచ్చని ఆ ప్రకటనలోm తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.