Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 12:28 pm Posted by : ramakrishna

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

. . . 50 వేల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల

మెండోరా,బతుకమ్మ :

 శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం,ఇన్ ఫ్లో పెరుగడంతో సోమవారం ఉదయం 10.40 నిమిషాలకు 9  వరద గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రవాహం పెరగడంతో అధనంగా 16 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు.

16 gates of Sriram Sagar project lifted

గోదావరి,మంజీరా,హరిద్రా నదుల నుంచి వరద పోటెత్తడంతో ఎస్సారెస్పీ కి  1,25, 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు సామర్థ్యం 80.5టియంసీలకు గాను 74.425టియంసీలు గా ఉంది. ప్రాజెక్టుకు లక్షన్నర క్యూసెక్కుల వరద వస్తుండటం,నిజాం సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ప్రాజేక్టుకు మరింత వరద పెరిగే సూచనలు ఉన్నాయి. ఉదయం ప్రాజెక్టులోని ఇందిరమ్మ కాలువ ద్వారా నీటి విడుదలను 18,000 క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువ ద్వార 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు.ప్రస్తుతం ప్రాజెక్ట్  16   వరద గేట్ల, కాలువల ద్వారా 76,867 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.