దుబ్బాకలో కన్యకా పరమేశ్వరి ఆలయ 15వ వార్షికోత్సవం
-రూ. 11 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆర్యవైశ్య సంఘం భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ 15వ వార్షికోత్సవం ఘనంగా కొనసాగింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ఆర్యవైశ్య దంపతులు సామూహిక అభిషేకం నిర్వహించారు.అమ్మవారి మూలమూర్తికి విశేష ద్రవ్యాలతో అభిషేకం,అర్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని, గర్భాలయాన్ని రూ. 11 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి మాతగా అలంకరించి...