-రూ. 11 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆర్యవైశ్య సంఘం భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ 15వ వార్షికోత్సవం ఘనంగా కొనసాగింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ఆర్యవైశ్య దంపతులు సామూహిక అభిషేకం నిర్వహించారు.అమ్మవారి మూలమూర్తికి విశేష ద్రవ్యాలతో అభిషేకం,అర్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని, గర్భాలయాన్ని రూ. 11 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి మాతగా అలంకరించి పూజలు చేశారు. అర్చనల అనంతరం మహిళలు లలితా సహస్రనామ పారాయణం,సామూహిక కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ వేలేటి జయరామ శర్మ, అర్చకులు వేలేటి రామకృష్ణ శర్మ వైదిక నిర్వహణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చింత నాగేందర్,ప్రముఖ వ్యాపార వేత్త చింత రాజు,గంగం ధనంజయం,నల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు