Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 5:23 pm Posted by : ramakrishna

మద్నూర్ – రుద్రూర్ హైవే కి 156 కోట్లు నిధుల విడుదల

మద్నూర్, బతుకమ్మ  : ఎట్టేకేలకు కామారెడ్డి జిల్లా లోని జుక్కల్ నియోజక వర్గం లో ప్రతిపాదించబడిన మద్నూర్ – రుద్రూర్ హైవే కి మహర్దశ మొదలైంది. గత సంవత్సర కాలంగా వివిధ రూపాలలో ఈ రహదారి యొక్క ప్రాధన్యత ని అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి కి ఇటు రాష్ట్ర రహాదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్ళి, నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందరిని పరుగులు పెట్టించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి ఫలించింది. బోధన్ – బాసర – భైంసా రహదారి లో భాగంగా మద్నూర్ – రుద్రూర్ సెక్షన్ రహదారి కలదు. ఈ రహదారి నిర్మాణం కోసం 156 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ సంధర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే పనితీరు పై ప్రజలు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. మద్నూర్ – రుద్రూర్ రహదారి కోసం 155 కోట్లు విడుదల కావడం గమనార్హం.