Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 5:09 pm Posted by : ramakrishna

15 సంవత్సరాల నిరీక్షణ నిజమైన వేళ..

  • విధుల్లో చేరుతున్న 2008 డీఎస్సి ఉపాధ్యాయులు

 

బతుకమ్మ, నవీపేట్ : గత 15 సంవత్సరాలుగా ఎదురు చూసిన క్షణం ఆవిష్కరణ అయినది. కోర్టు తీర్పుతో డీఎస్సి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఎస్జీటీ ఉపాధ్యాయులుగా ఉత్తర్వులు విడుదల చేయడంతో శనివారం నాడు డీఈఓ కార్యాలయంలో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు సోమవారం నాడు తమకు కేటాయించిన స్కూల్ లలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేరారు. ముందుగా ఎంఇఓ కార్యాలయలలో తమ నియామక పత్రాలు, సర్టిఫికెట్స్ దృవీకరించుకొని తదనంతరం స్కూల్ లలో విధులలో చేరారు. ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా, మండల నాయకులు నూతన ఉపాధ్యాయులను స్వాగతించారు.