బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13%...