బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలి బతుకమ్మ భిక్కనూరు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7%...