విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలి
. . . ప్రొఫెసర్ జి. హరగోపాల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర బడ్జెట్లో ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి రహదారులు, భవనాలు శాఖ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయులను తగ్గించే, పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకొని, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు....