15 నెలలు.. రూ.లక్షా 50వేల కోట్ల అప్పు
అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ అప్పులు, ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి కేసీఆర్ పదేళ్లలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు రూ. లక్షా 52 వేలకుపైగా అప్పులు చేసిందని ఎండగట్టారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పనీ...