నిజామాబాద్, బతుకమ్మ : 15 మంది డీఎస్పీలకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలోని వివిధ జిల్లాల్లో ఏసీపీ, డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నల్గొండ, నిజామాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్న డీఎస్పీలకు ఏఏస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్ రావుకు పదోన్నతి కల్పించి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇపపటి వరకు కొత్తగా పదోన్నతి పొందిన అదనపు ఎస్పీలకు ఎవరికీ పోస్టింగ్ లు ఇవ్వలేదు.