Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 5:17 pm Posted by : ramakrishna

ఘనంగా దుర్గమాత 13వ వార్షికోత్సవం

ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి బస్టాండ్ ప్రాంగణంలో శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గా మాత  వద్ద అన్న సత్రం నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గా మాత దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వాములు పాటలు,ఆటలతో పూజలు నిర్వహించారు.అనంతరం మొక్కులు తీర్చుకొని మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా  భక్తులు తండోపతండాలుగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.మహా అన్నదాన సత్రాన్ని విజయవంతం చేసిన భక్తులకు వివిధ గ్రామల ప్రజలకు,స్వాములకు దుర్గామాత కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ ప్రజలు, భక్తులు,అమ్మవారి మాల భక్తులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

13th anniversary of Goddess Durga celebrated in grand style