Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 5:51 pm Posted by : ramakrishna

ప్రజావాణికి 135 ఫిర్యాదులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

 

135 complaints received at Prajavani

 

ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్.సీ.ఓలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షంలో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. కాగా, ఈ నెల 25 నుండి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ బీ.ఎల్.ఓ లను సంప్రదించి మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని సూచించారు.  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

135 complaints received at Prajavani