Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 6:18 pm Posted by : ramakrishna

రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

 

. . . పోలీసు కమిషనర్ సాయిచైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఈ నెల 9 నుంచి 20వ తేది వరకు 134 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించి మొత్తం 134 కేసుల నమోదు చేయగా రూ.12,10,000 జరిమానా విధించగా వీరిలో 13 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు సీపీ వెల్లడించారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహన పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని సీపీ తెలిపారు.