కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 130 క్యూసెక్కుల వరద నీరు
జుక్కల్, బతుకమ్మ : కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 130 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 457.50 మీటర్లకు చేరినట్లు ప్రాజెక్టు అధికారి శివకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 130 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నప్పటికీ, అవుట్‌ఫ్లో లేదని శివకుమార్ తెలిపారు. నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.