Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 6:40 pm Posted by : ramakrishna

ప్రజాభిప్రాయ సేకరణలో 128 విజ్ఞప్తులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తెలంగాణ బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణ సందర్భంగా అఫిడవిట్ రూపంలో మొత్తం 128 విజ్ఞప్తులు వచ్చాయని కమిషన్ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 102 వినతులు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి 26 వినతులు వచ్చాయని వివరించారు.

128 appeals in the referendum