Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2024, 4:14 pm Posted by : ramakrishna

కామారెడ్డి ప్రజావాణిలో 120 ఫిర్యాదులు

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 120 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్ కు తరలివచ్చి తమ సమస్యలను కలెక్టర్ తోపాటు ఉన్నతాధికారులకు విన్నవించారు. జడ్పీ సీఈవో చందర్, డీపీవో శ్రీనివాస రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

120 complaints in Kamareddy Prajavani