12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

బాన్సువాడ, బతుకమ్మ : కోటగిరి నుంచి హైదరాబాద్ కు  అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సోమవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద బాన్సువాడ ఏఎస్సై సీతారామలక్ష్మి , కానిస్టేబుళ్లు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యన్ని గుర్తించారు. బియ్యం రవాణా చేస్తున్న డ్రైవర్ ఎజాస్ ను అదుపులోకి తీసుకొని నస్రుల్లాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.