Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 8:40 pm Posted by : ramakrishna

రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి

  • మాదిగ జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో మాదిగల జనాభాకు అనుగుణంగా 12శాంతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేయాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసారు . ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా అయితే జిల్లాల వారిగా వర్గీకరణ అమలు చేస్తాం అన్నారో తెలంగాణలో కూడా అలాగే అమలు చేయాలని అప్పుడే మాదిగలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన చేయాలని లేకుంటే మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ, జిల్లా నాయకులు విజయ్ మాదిగ, ప్రశాంత్ మాదిగ, అన్న బాహు సాటే సంగం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, జిల్లా నాయకులు శంకర్, మేనత్కర్ గణేష్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

12 percent reservation should be reserved for Madigalas in the state