
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: దీపావళి సందర్భంగా జిల్లాలో జోరుగా పేకాట సాగింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధ, గురువారాల్లో మొత్తం 116 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో మొత్తం రూ.11,47,240 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ డివిజన్ లో 53 కేసులు నమోదు చేసి 267 మందిని అరెస్టు చేశారు. రూ.5,03,570 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్ లో 26 కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్టు చేశారు. 2,85,570 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్ డివిజన్ లో 37కేసుల్లో 192 మందిని అరెస్టు చేసి పట్టుబడిన వారి నుంచి 3,58,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ చార్జి సీపీ సింధుశర్మ ప్రకటనలో తెలిపారు. దీపావళి సందర్భంగా పేకాటను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా సారించి ప్రత్యేక టీములు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.