Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 6:52 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లాలో 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

 కామారెడ్డి, బతుకమ్మ:  కామారెడ్డి జిల్లాలో  డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో భాగంగా కామారెడ్డి వ్యాప్తంగా 110  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి ,66 వెహికల్స్   సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కామారెడ్డి సబ్ డివిజన్లో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,   ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో 28 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, బాన్సువాడ సబ్ డివిజన్లో 22 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కేసులు ఒక్కరోజులో నమోదు చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా ఎవరు మద్యం త్రాగి వాహనాలు నడపరాదని  రహదారి భద్రతా నియమ నిబంధనలను పాటించి ఈ సంవత్సరం  రోడ్డు ప్రమాదాలు ,మరణాలు తగ్గే విధంగా  పోలీసు శాఖ వారు  తీసుకునే చర్యలలో ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు.