Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 10:28 pm Posted by : ramakrishna

11మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో గల మహాలక్ష్మి నగర్ కాలనీ లో పేకాట ఆడుతున్న11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ  శ్రీకాంత్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పేకాట  రాయుళ్లను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద రూ.72,470 నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.