Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 2:55 pm Posted by : ramakrishna

పదో తరగతి ఫలితాలు విడుదల

 

. . .  రాష్ట్రంలో 95.15  శాతం ఉత్తీర్ణత

. . . రిజల్ట్స్ ములుగు ఫస్ట్…. హైదరాబాద్ లాస్ట్

. . . ఈ సారి కూడా ఎస్సెస్సీ లో అమ్మాయిలే టాప్

 హైదరాబాద్, బతుకమ్మ:

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సెస్సీ  ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్ లు రిజల్ట్ ను విడుదల చేశారు. ఈ సారి కూడా రిజల్ట్ లో అమ్మాయిలు, అబ్బాయిల కన్న ముందున్నారు. రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5,28,239 మంది హాజరు కాగా 4,97,312 మంది పాస్ కాగా ఉత్తీర్ణత శాతం 95.15 గా నమోదైంది అధికారులు తెలిపారు. బాలురు 94.7 శాతం పాస్ కాగా, బాలిక లు 96.26 శాతం ఉత్తీర్ణులయ్యారు.  స్టేట్ లో 5731 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్టు ఫలితాలలో వెల్లడైంది. రాష్ట్రంలో ఈ సారి అడవుల జిల్లా ములుగు లో 99.30 శాతం పాస్ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో నిలవగా,89.23 శాతంతో హైదరాబాద్ లాస్ట్ గా నిలిచింది. ఫలితాల వివరాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో పొందు పరిచారు. వాట్సప్ నెంబర్ 8096958096 కు  మెసేజ్ చేసిన ఫలితాలు  వచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి. పదో తరగతి ఫలితాల తర్వాత విద్యార్థులు క్షణికావేశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

10th class results released
10th class results released