పదో తరగతి ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్

మోర్తాడ్, బతుకమ్మ : మోార్తాడ్ మండలంలోని  శెట్పల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ టీం జీహెచ్ఎం వేణుగోపాల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను వారు సాధించిన మార్కులను వెరిఫై చేశారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్ లను విద్యార్థుల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శెట్పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుధ, టీం సభ్యులు సాయిలు, నారాయణ, అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం, సీఆర్పీ రాజు పాల్గొన్నారు.