పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : పదవ తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 54 కేంద్రాల్లో 12,579 మంది విద్యార్థులు...