Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 3:42 pm Posted by : ramakrishna

ఘనంగా 108 ఈఎంటీ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ లో పని చేస్తున్న 108 సిబ్బంది ఈఎంటీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. 108 సర్వీస్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ సేవలకు గుర్తింపుగా ఈఎంటీ డేను ప్రతి ఏడాది ఏప్రిల్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. 108 కార్యాలయంలో పీఎం వసంత్ కేక్ కట్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు.