Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 5:57 pm Posted by : ramakrishna

రథసప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాలు

రుద్రూర్, బతుకమ్మ :

 

రథసప్తమిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని యోగా ధ్యాన మందిరంలో ఆదివారం పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాలు నిర్వహించారు.  సూర్య నమస్కారం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్య వికాసం జరుగుతుందని, ప్రతిరోజు ఆచరించిన వారికి ఎలాంటి రోగాలు రావని, దీర్ఘాయుష్షు పెరుగుతుందని ఈ సందర్భంగా యోగా సాధకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రబారి విశ్వనాధ్ మహాజన్, యోగ ఇన్స్ట్రక్టర్ డి.సతీష్ గౌడ్, కిసాన్ సమితి ప్రబారి పుట్టి  ప్రకాష్, సాయి బాబా, హనుమాన్లు చిదుర మహిపాల్, కటిక రామ్ రాజ్, కాసుల శ్రీనివాస్, బోతల్వార్ అశోక్, యోగ సభ్యులు పాల్గొన్నారు.