కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతడికి ప్రాథమిక చికిత్స అందించి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద ఉన్న సెల్ ఫోన్, రూ.15,500 నగదును సిబ్బంది గుర్తించారు. ఆ నగదును భద్రపరిచి, యాదగిరి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడటమే కాకుండా, నగదును తిరిగి ఇచ్చి తమ నిజాయితీని చాటుకున్న పైలట్ ప్రశాంత్, ఈఎంటీ ప్రభాకర్‌ను స్థానికులు, బాధితుడి కుటుంబ సభ్యులు అభినందించారు.