Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 3:34 pm Posted by : ramakrishna

108 లో ఈఎంటీ, పైలట్ ఉద్యోగ నియామకాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా108 లో పని చేయడానికి ఉద్యోగాల నియామకాల కోసం ఇంటర్వ్యూ ని గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం (నవంబర్ 28నుండి డిసెంబర్ 1తేదీ వరకు)నిర్వయించనున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్, జిల్లా కోర్డినేటర్ పెండ్యాల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని 108 అంబులెన్స్ కార్యాలయం లో ఇంటర్వ్యూ కొనసాగుతదని చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉద్యోగాల కోసం బీఎస్సీ లైఫ్ సైన్స్, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, జీఎన్ఎం, డీఎంఎల్టీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. పైలట్   ఉద్యోగాల కోసం పదోతరగతి పాసై బ్యాచ్ నెంబర్ కలిగి ఉండాలని అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాల తో పాటు జీరాక్స్ పత్రాలను తీసుకురావాలని సూచించారు. వయస్సు 22 నుండి 30 సంవత్సరాలు ఉండాలని పేర్కొన్నారు. వివరాల కోసం 9100799161, 8074652252 నంబర్ల ను సంప్రదించాలని తెలిపారు.