Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 12:56 pm Posted by : ramakrishna

నిజామాబాద్ జిల్లాలో   గ్రూప్ 2 పరిక్షకు 10,785 మంది గైర్హజరు

నిజామాబాద్ జిల్లాలో   గ్రూప్ 2 పరిక్షకు 10,785 మంది గైర్హజరు

 నిజామాబాద్ , బతుకమ్మ:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన  పరీక్షకు జిల్లాలో మొత్తం 19,855 మంది అభ్యర్థులకు గాను, 9070 మంది హాజరు కాగా, 10,785 మంది గైర్హాజరు అయ్యారు.

 

10,785 Absent for Group 2 Examination in Nizamabad District

 

కామారెడ్డి జిల్లాలో  గ్రూప్ 2 పరిక్షలకు 50.88 శాతం హజరు..

కామారెడ్డి జిల్లాలో గ్రూప్ 2 పరిక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అదివారం ఉధయం కామారెడ్డి జిల్లాలో 19 కేంద్రాలలో పరిక్షలలో మొదట విడత లో జరిగిన 8085  మందికిగాను 3971 మంది హజరు అయ్యారు. 4114 మంది గైర్హజరు అయ్యారు. జిల్లాలో మొదటి సెషనల్ లో 50.88 శాతం హజరు నమోదు అయింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ , జిల్లా ఎస్పీ సిందూ శర్మలు పర్యవేక్షించారు.

10,785 Absent for Group 2 Examination in Nizamabad District