Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2024, 7:57 pm Posted by : ramakrishna

డయల్ 100 దుర్వినియోగం చేసిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష

ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అందిస్తున్న డయల్ 100 సేవలను దుర్వినియోగపరిచినందుకు ఇందల్వాయిపోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ బాబా అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు.  నిజామాబాద్ కోర్టు నందు హాజరుపరచగా 2వ క్లాసు మెజిస్ట్రేట్  డయల్ 100 సేవలను దుర్వినియోగపరచిన అట్టి వ్యక్తికి 2 రోజుల  జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపినారు. అత్యవసర సమయాల్లో తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకొని 100 డయల్ చేసినట్లయితే కఠినంగా శిక్షించబడుతుందని ఎస్సై మనోజ్ కుమార్ హెచ్చరించారు దీనిని స్థానిక ప్రజలందరూ గమనించాలని కోరారు.