మోర్తాడ్ మండలంలో మొదటిరోజు 10 నామినేషన్లు

మోర్తాడ్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోర్తాడ్ మండలం లో బుధవారం  పది నామినేషన్లు వచ్చినట్లు మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి తెలిపారు. రిటర్నింగ్ అధికారి పెద్ద సంతోష్ కుమార్ నామినేషన్ లను అభ్యర్థుల నుంచి స్వీకరించారు. మోర్తాడ్ మండలం లో ధర్మోరా-1, ధోన్ పాల్-1, గాండ్లపేట్-1, మోర్తాడ్-2, పాలెం-2, శెట్ పల్లీ -1, సుంకేట్-1, తిమ్మాపూర్-1 8 గ్రామాల్లో 10 నామినేషన్లు రాగా దొనకల్, వడ్యాట్ గ్రామాల్లో ఒక్క నామినేషన్ లేదని తెలియజేశారు.