Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 7:18 pm Posted by : ramakrishna

ఎన్ కౌంటర్ లో 10మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ ఘఢ్, బతుకమ్మ : ఛత్తీస్ ఘఢ్ గరియాబంద్ వద్ద గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోందం బాలకృష్ణ సైతం ఉన్నట్లు సమాచారం. రాయ్పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.