Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:51 pm Posted by : ramakrishna

10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి

 

. . . పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎస్‌ఐలు)గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు శుక్రవారం ఈ పదోన్నతులు కల్పించారు. పదోన్నతి పొందిన సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను కలిసి అభినందనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొంతకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బందిలో ఆనందం వ్యక్తమైంది. పదోన్నతి పొందిన అధికారులు తమపై పెరిగిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మరింత సేవలందించాలని కమిషనర్ సూచించారు. ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన వారిలో ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన కె. శంకర్ (నం.1398), వేల్పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్. కైలాస్ పతి (నం.1300), ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. చందూలాల్ (నం.1420), ఎన్‌ఐబీ నిజామాబాద్‌కు చెందిన ఆర్. మోజీరామ్ (నం.1380), ముగ్పాల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. పాండు (నం.1349), టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎ. ముత్తన్న (నం.1307), టౌన్-5 పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. రాజు (నం.1325), ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన జి. లక్ష్మణ్ (నం.1326), భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన జి. శ్రీనివాస్ (నం.1319), వర్ని పోలీస్ స్టేషన్‌కు చెందిన జి.వి. శంకర్ (నం.1313) ఉన్నారు. అదేవిధంగా ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కె.సి. శర్మ (నం.1433) ఏఆర్‌ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన పోలీస్ సిబ్బందికి పోలీస్ అధికారులు, సహచర సిబ్బంది అభినందనలు తెలిపారు.