1.6 కిలోల గంజాయి స్వాధీనం

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నగర శివారులోని ముస్తాయిద్ పురా లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్టు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ముస్తాయిద్ పురా లోని షేక్ అబ్దుల్ ఖైజర్ అనే వ్యక్తి తన ఇంటిలో గంజాయి విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారం ప్రకారం దాడి నిర్వహించినట్టు తెలిసారు. ఈ దాడిలో అబ్దుల్ ఖైజర్ ను, 1.6 కిలోల గంజాయి ని స్వాధినపరుచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఖైజర్ ను కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడులలో ఎస్ హెచ్ ఓ స్వప్న, సిబ్బంది...