Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 7:18 pm Posted by : ramakrishna

డీఏస్పీ భీమ్ రెడ్డి భీనామీ వద్ద 1.35 కోట్ల సీజ్

 

. . .  విదేశీ కరెన్సీ.. విదేశీ మద్యం స్వాధీనం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి చంచల్ గుడా జైలు లో ఉన్న డీఏస్పీ బీమ్ రెడ్డి ఆస్తులు మళ్ళీ బయట పడ్డాయి. గురువారం ఏసీబీ అధికారులు హైదరాబాద్, జహీరాబాద్ లలో సోదాలు నిర్వహించారు. బొమ్మకంటి వెంకటేష్ అనే బినామీ ఇంట్లో తనిఖీ లు చేసి రూ. 1.35 కోట్ల నగదు అందులో విదేశీ కరెన్సీ తో కలిపి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 14 లీటర్ ల ఫారిన్ మద్యం కూడా సీజ్ చేసారు.  డిజిపీ కార్యాలయం లో కంప్యూటర్ విభాగం లో డిఎస్పీ గా పని చేస్తున్న సంకినేని భీమ్ రెడ్డి పై జూన్ 26 న ఏసీబీ ఆదాయం కు మించి ఆస్తులు ఉన్నాయని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భీమ్ రెడ్డి వద్ద గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 200 కోట్ల పై మాటే. హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతం లో ఎస్ఐ గా విధుల్లో చేరిన భీమ్ రెడ్డి డిఎస్పీ క్యాడర్ అయ్యే వరకు కోట్ల రూపాయలు పోగేసి చివరకు కట కటాల పాలయ్యారు.

₹1.35 crore seized from DSP Bhim Reddy's *benami* (proxy).