షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే ? ఏపీలో ఏం జరగబోతోంది

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపే లక్ష్యంతో ఏడాది క్రితం వైఎస్సార్టీపీని స్ధాపించారు. అప్పట్లో తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర కూడా చేశారు. అయితే తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పోటీ పడి నెగ్గలేమనుకున్నారో ఏమో.. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేయాలనే నిర్ణయానికి షర్మిల వచ్చేశారు. ఈ వారంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా వైఎస్సార్టీపీని విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశాక ఏం...